నేటికాలంలో కొంత మంది యువత తమ పరాజయాలకు చాలా కారణాలు చెబుతుంటారు. ఆర్థిక సమస్యలని, బోధనలు సరిగ్గా లేదని ఇలా మరేన్నో అంశాలను కారణాలుగా చూపిస్తారు. కానీ కొందరు మాత్రం ఎన్ని సమస్యలున్న అనుకున్న లక్ష్యం మాత్రమే వారి కళ్లకు కనిపిస్తుంది. ఎటువంటి సమస్యలున్న ధైర్యంగా ఎదుర్కొంటు ముందుకు సాగి.. అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. ఆ కోవకు చెందిన యువకుడే కొంకాడ రమేష్. వారి కుటుంబం రోజు కూలీ చేసుకుని జీవనం సాగిస్తుంది. తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయినా ఇలాంటి సమయంలో కూడా కష్టపడి అనుకున్న విజయం సాధించాడు రమేష్.
శ్రీకాకుళం జిల్లాలోని సారవ కోట మండలం మూగుపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ, మాణిక్యమ్మ దంపతుల కుమారు రమేష్. మనస్పర్థల కారణంగా రమేష్ చిన్నతనంలోనే నారాయణ,మాణిక్యమ్మ విడిపోయారు. రమేష్ చిన్నప్పటి నుంచి తల్లితోనే మూగుపురంలో పెరిగారు. మాణిక్యమ్మ కూలి పనులు చేసుకుంటూ రమేష్‌ను చదివించారు. రమేష్ ఒకటి నుంచి 7వ తరగతి వరకు టెక్కలి గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్షియల్ పాఠశాలలో తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తన చిన్నాన్న సహకారంతో కాకతీయ యూనివర్సిలో డిగ్రీ పూర్తి చేశాడు.
తరువాత ఎంబీఏ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎల్ కూడా 2015లో పూర్తి చేశారు. బీఎల్ పూర్తి చేశాక జడ్జి కావాలనే పట్టుదలతో చదివాడు. రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయినా నిరుత్సాహ పడలేదు. మరింత కష్ట పడి 2020లో వెలువడిన నోటికేషన్‌లో విజయం సాధించాడు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మరి.. ఈ యువకుడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.