పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శాంతాకుమారి. ఆమెకు 2018లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ.. చివరికి ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు బమ్మిడి శాంతాకుమారి, వయసు 39 ఏళ్లు. 2018లో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు భార్యాభర్తలు బాగానే సంసారం చేశారు. అలా చాలా ఏళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ, ఏళ్లు గడుస్తున్నా ఈ భార్యాభర్తలకు పిల్లలు మాత్రం కలగలేదు. ఇదే విషయమై శాంతాకుమరి తరుచు బాధపడుతూ అనేక ఆలోచనలు చేసింది. ఇదిలా ఉంటే, ఈ నెల 22న భార్యాభర్తలు గొడవ పడ్డారు. కోపంతో భార్యను ఇంట్లోనే వదిలి భర్త తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఇక భర్త వెళ్లిపోయి నాలుగు రోజులు గడిచింది. ఆ మహిళ ఉంటున్న ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఎందుకో అనుమానం వచ్చి స్థానికులు తలుపులు తెరిచి చూడగా జరిగింది చూసి అందరూ షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జమ్మిడి జయకుమార్, శ్రీకాకుళంకు చెందిన శాంతాకుమారి (39)కి 2018లో వివాహం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు నరసన్నపేటలోని శ్రీరామ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఇక పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ, వివాహం జరిగి చాలా ఏళ్లు గడుస్తున్నా వీరికి పిల్లలు మాత్రం కలగలేదు. ఇదే విషయమై శాంతాకుమారి తరుచు బాధపడేది. ఇదిలా ఉంటే, పిల్లలు కలగడం లేదని, అదనపు కట్నం వంటి సమస్యలతో భర్తతో పాటు అత్తమామలు సూటిపోటి మాటలతో వేధించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారు. ఇకపోతే, ఈ నెల 22న ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. ఇక కోపంతో భర్త భార్యను అక్కడే వదిలి తన స్వగ్రామం అయిన నందిగాం మండలం శ్రీపురం వెళ్లిపోయాడు. దీంతో శాంతాకుమరి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టి ఈ నెల 23న తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే నాలుగు రోజుల నుంచి ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. దీంతో వారి ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శుక్రవారం స్థానికుల సాయంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా షాక్ గురయ్యారు. వంట గదిలో ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు భర్తకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పిలిపించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మృతురాలి భర్త జయ కుమార్ మాట్లాడుతూ.. శాంతి కుమారి నన్ను వేధించడంతో పాటు నాపై దాడి కూడా చేసిందని, అందుకే స్వగ్రామం వెళ్లిపోయానని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత భర్త, అత్తమామల వేధింపుల వల్లే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.