పుల్లారెడ్డి స్వీట్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. అయితే ఆయన మనవడు ఏక్ నాథ్ రెడ్డి మాత్రం వివాదాస్పదం అవుతున్నారు. ఆయన వైవాహిక జీవితం సరిగ్గా సాగడం లేదు. ఈ క్రమంలో ఆయన తన భార్య ను ఇంట్లో నే ఉంచి ఆమెను బయటకు రాకుండా ఉండేందుకు తాను ఇంట్లో ఉన్న రూమ్ లో ఒక అడ్డు గోడను రాత్రి కి రాత్రే నిర్మాణం చేసి అతను ఇంటికి తాళం వేసి పారిపోయాడు. అతి కష్టం మీద ఏక్ నాథ్ రెడ్డి భార్య బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం. పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తనఇంట్లో నుంచి బయటకు రానివ్వడంలేదని ఏక్ నాథ్ రెడ్డి భార్య ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఆమెను ఇంట్లోనే ఉంటి బయటకు రానివ్వకుండా ఉండేందుకు రాత్రికే రాత్రే తన గదికి అడ్డంగా ఓ గోడను కట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: పామును రక్షించబోయి AP MLA కారుకు ప్రమాదం!ఈ విషయంపై ఏక్ నాథ్ ఇంకా స్పందించలేదు. ఆయన కుటుంబం కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే వివాహ బంధంలో ఇబ్బందులు ఉంటే కలిసి చర్చించుకోవాలని.. ఒక వేళ కలసి బతకలేకపోతే విడిపోవచ్చు కానీ.. ఇలా ఇళ్లల్లో ఉండగానే గోడలు కట్టేసి పారిపోవడం ఏమిటని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.