పామును రక్షించబోయి AP MLA కారుకు ప్రమాదం!

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు తమ మానవత్వం చాటుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రోడ్డు పై ప్రమాదానికి గురైన వారిని తమ సొంత కార్లలో ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్య సిబ్బందికి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్నారు. సాధారణంగా వాహనాల్లో వెళ్తున్న సమయంలో రోడ్డు పై ఏదైనా జంతువులు అడ్డు వస్తే అవి పోయే వరకు ఆపుతుంటారు. అలా డ్రైవర్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. తాజాగా ఏపి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తన మానవత్వం చాటుకున్నారు.

ఇది చదవండి: మల్టీస్టారర్ గా ఖైదీ-2! కార్తీతో తొలిసారి స్క్రీన్ షేర్ చోసుకోనున్న సూర్య!

image 1 compressed 55ఏపి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పయణిస్తున్న కారుకి రోడ్డు పై ఓ పాము అడ్డు వచ్చింది.. ఆ పామును గమనించి దాన్ని తప్పించే క్రమంలో కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన పుట్టపర్తి మండలం కంబాలపర్తి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కంబాలపర్తి గ్రామం దాటగానే పొలాల్లో నుంచి పెద్ద నాగుపాము కారుకు అడ్డుగా వచ్చింది. పామును చూసిన డ్రైవర్‌ షడన్‌గా బ్రేక్‌ వేశాడు. దాంతో వెనుక నుంచి వస్తున్న వెనుక కాన్వాయ్‌లో వస్తున్న మరో కారు ఎమ్మెల్యే కారును ఢీకొంది.

ఇది చదవండి: YS Jagan: బ్రేకింగ్: సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్..

ఈ క్రమంలో ఎమ్మెల్యే కారుతో పాటు మరో కారు కొంత పాక్షికంగా ధ్వంసమైంది. అయితే కాన్వాయ్‌లో ఉన్న వారెవెరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాన్వాయ్ డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఏది ఏమైనా వేగంగా వెళ్లి పాముకు ప్రమాదం కాకుండా బ్రేక్ వేసి దాని ప్రాణాలు రక్షించిన డ్రైవర్ ని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మెచ్చుకున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.