ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. రాజ్‌భవన్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ప్రహరీపై, సగం గాలిలో ఊగుతూ కనిపించింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక కారు స్పీడ్ గా వస్తున్న సమయంలో బ్రేక్ ఫేయిల్ కావడంతో ప్రహరీని ఢీకొట్టి సగం ప్రహరీపై, సగం గాలిలో ఊగుతూ ఆగింది. వెంటనే స్పందించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు కారులో చిక్కుకున్న మహిళను కాపాడారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్ భవన్ రహదారిలోని మాజీ ఎంపీ జి.వివేక్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి వైపు వెళుతుంది. 15 అడుగుల ఎత్తులో వాహనం ముందు భాగం గాలిలో వేలాడింది.
ఈ ఘటనతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గోడ కూలిపోవడంతో కింద ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు. కారు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు వాహనం నడుపుతున్న మహిళ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.