ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై దాడి.. ఈ వార్త న్యూస్ లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కర్ణాటకలోని బళ్లారిలో ఆమె ఓ ప్రోగ్రామ్ కు హాజరై తిరిగి వస్తుండగా.. ఈ సంఘటన జరిగిందని ఏకంగా వీడియోలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. కారుపై దాడి చేసేంతగా ఏం జరిగిందని తెగ మాట్లాడుకున్నారు. సదరు వీడియోలు చూసి తెగ భయపడ్డారు. మంగ్లీపై వాళ్లకు ఎందుకు కోపం వచ్చిందని కూడా తెగ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ.. ఏకంగా ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు జానపద గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో పాపులర్ అయిన ఈమె.. ‘రా రా రక్కమ్మ’ పాటతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా వచ్చిన ‘ధమాకా’లోనూ జింతాత, దండకడియాల్ సాంగ్స్ పాడి ఆకట్టుకుంది. ఇక జనవరి 21 రాత్రి.. బళ్లారిలో మంగ్లీ ఓ ఈవెంట్ కి అటెండ్ అయింది. అందులో మంగ్లీ కన్నడ మాట్లాడకపోవడంతో.. ఈవెంట్ పూర్తి చేసుకుని వెళ్తుండగా, కొందరు యువకులు మంగ్లీ కారుపై దాడి చేశారనే న్యూస్ వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. ఇప్పుడు దీనిపై మంగ్లీ స్పష్టత ఇచ్చేసింది.
‘నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలని నేను పూర్తిగా ఖండిస్తున్నా. నా బెస్ట్ ఈవెంట్స్ లో ఇదొకటి. సూపర్ గా జరిగింది. కన్నడ ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు మర్చిపోలేనిది. ఈవెంట్ లోనూ నన్ను బాగా చూసుకున్నారు. ఇది మాటల్లో చెప్పలేను. ఇదంతా నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చేస్తున్న పని. ఈ తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని మంగ్లీ చెప్పుకొచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొందరైతే ఏది నిజమో తేల్చుకోలేకపోతున్నారు. ఏదైతేనేం మంగ్లీ సేఫ్ గానే ఉంది కదా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.