హీరోయిన్ తాప్సీ వివాదంలో చిక్కుకుంది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు తాప్సీ చేసిన నేరం ఏమిటి? ఆమెపై ఎవరు కేసు పెట్టారు?
హీరోయిన్ తాప్సీ పరిచయం అవసరం లేని పేరు. ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి అనేక సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. సినిమాల్లో ఎలా ఉన్నా బయట మాత్రం టామ్ బాయ్ లా ఉంటుందని ఆమెతో పని చేసిన వాళ్ళు చెబుతారు. మగరాయుడిలా ఉంటుందని, ఎవరి మాట వినదని అంటూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈమెపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఇటీవలే ఆమె ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఆ ఫ్యాషన్ షోలో ఆమె కనబడిన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ ఆమెపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
మార్చి 12న ముంబైలో జరిగిన లాక్ మి ఫ్యాషన్ వీక్ 2023 షోలో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువుల ఆరాధించే లక్ష్మీదేవి లాకెట్ వేసుకుంది. ఫ్యాషన్ షో అంటేనే మితిమీరిన గ్లామర్ ప్రదర్శన షో ఉంటుంది. ప్రైవేటు పార్ట్స్ కనబడేలా దుస్తులు ధరిస్తారు. దీనిపై హిందూ సంఘాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ చేసే వాళ్ళు దేవతల లాకెట్లు ధరించడం ఏంటని మండిపడుతున్నారు. హిందూ దేవతలను అవమానించిందంటూ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీపై ఫిర్యాదు చేశారు. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు, లక్ష్మీదేవి లాకెట్ ధరించి అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు.. ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలిని తనయుడు ఏకలవ్య గౌర్ తాప్సీ మీద కేసు వేశారు.
లక్ష్మీదేవి లాకెట్ తో అభ్యంతరకరమైన దుస్తులు వేసుకుని తాప్సీ క్యాట్ వాక్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బ తీసిందని వచ్చిన ఫిర్యాదు మేరకు తాప్సీపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. హిందువుల ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవి బొమ్మతో కూడిన లాకెట్ ను మెడలో వేసుకుని.. ఎక్స్ పోజింగ్ చేస్తూ లాక్ మి ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసిందని ఆమెపై ఫిర్యాదు చేశామని, తాప్సీ ర్యాంప్ వాక్ చేయడం పక్కా కుట్ర అని.. సనాతన ధర్మాన్ని చులకన చేసేందుకు ప్లాన్ అని ఏకలవ్య గౌర్ ఆరోపణలు చేశారు. మరి తాప్సీ లక్ష్మీదేవి లాకెట్ ధరించి ఫ్యాషన్ షోలో ప్రదర్శించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.