ఇటీవల రోడ్డు పై పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. చేపలు,కోళ్లు,లిక్కర్, నూనె వాడుకునే ఇతర వస్తువుల లోడ్ తో వెళ్తున్న వ్యాన్లు, లారీలు, ట్యాంకర్లు బోల్తా పడితే.. డ్రైవర్, క్లీనర్ చచ్చారా? బతికారా? అన్నది చూడకుండా వాటిని పట్టుకుపోయే పనిలో నిమగ్నం అవుతున్నారు జనాలు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ లో ఏది కొనాలన్నా ధరలు చూసి భయపడిపోతున్నారు ప్రజలు. అలాంటిది రోడ్డుపై ఫ్రిగా ఏదైనా దొరికితే క్షణం ఆలోచించకుండా వెంటనే తీసుకుంటారు. ఈ కాలంలో ఫ్రీగా వస్తే ఏదీ వదిలిపెట్టరు. ఇటీవల రోడ్డుపై పలు వాహనాలు బోల్తాపడి వస్తువులు రోడ్డుపై పడితే క్షణాల్లో మాయం చేస్తున్నారు. పక్కవారు ఏదైనా ప్రమాదంలో ఉన్నారా అన్న ఆలోచన కూడా లేకుండా తమ పని తాము చేసుకుంటూ అందినంత వరకు ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే లోకంలో అసలు మానవత్వం దాగి ఉందా అని అనుమానాలు వస్తుంటాయి. తాజాగా బిస్కెట్ ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. అక్కడ పడిపోయిన బిస్కెట్ ప్యాకెట్స్ గురించి జనాలు ఎగబడ్డారు. ఈ ఘటన గండేపల్లిలో చోటు చేసుకుంది.
ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అప్పుడప్పుడు రోడ్డుపై ఏదైనా వస్తువులతో వెళ్తున్న లారీలు, వ్యాన్లు, ఇతర వాహనాలు ప్రమాదానికి గురై పడిపోతే రోడ్డు పై పడిపోయిన వస్తువులను జనాలు ఎగబడి మరీ తీసుకుంటున్నారు. ఇటీవల లిక్కర్ లోడ్ తో వెళ్తున్న లారా బోల్తా కొట్టినపుడు, చేపల లోడ్ తో వెళ్తున్న లారీ, కోళ్ల లోడ్ తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడినపుడు.., డిజిల్, మంచినూనె లోడ్డ తో వెళ్తున్న ట్యాంకర్ ప్రమాదాని గురై రోడ్డుపై పడితే అక్కడికి చేరుకునే జనాలు బాధితులకు సాయం చేయడం పక్కనబెట్టి.. కార్లు, బైకులు ఆపి మరీ వాటిని త్వరగా తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటనే గండేపల్లిలో చోటు చేసుకుంది. బిస్కెట్ లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ నుంచి కిండపడిపోయిన బిస్కెట్ ప్యాకెట్లను జనాలు క్షణాల్లో మాయం చేశారు.
గండేపల్లిలో బిస్కెట్ ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న ఆటోకి కట్టిన తాడు తెగిపోయింది. దాంతో, ఆటోలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు రోడ్డుపై పడిపోయాయి. ఆటో వెనుకాలే వెళ్తున్న కార్లు, బైకులు.. ఇతర వాహనాలు ఆపి బిస్కెట్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. రాజమండ్రి నుంచి తునికి బిస్కెట్ల లోడ్ తో ఆటో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది దూరం వెళ్లాక ఈ విషయం ఆటో డ్రవైర్, క్లీనర్ కి తెలియడంతో వెనక్కి వచ్చారు.. కానీ అప్పటికే జనాలు దొరికింది దొరికినట్లు పట్టుకెళ్లారు. దీంతో ఆటో యజమాని లబో దిబో మన్నాడు.. ఆ నష్టం మొత్తం తానే భరించాలని కన్నీరు పెట్టుకున్నాడు.