దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువై పోతున్నాయి. ఒక్కరు చేస్తున్న తప్పుకి ఎంతో మంది మరణిస్తున్నారు. దీంతో ఇంట్లో పెద్దదిక్కు కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు.
దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ నియంత్రణ కోల్పోవడం.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా తీసుకుంటున్నా.. ప్రమాదాలను మత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లో మంగళవారం ఫతేపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ఓ ట్యాంకర్ దూసుకు వెళ్లి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడిక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఘాతంపూర్ నుండి జెహానాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘోరమైన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు అంతా రక్తసిక్తమై భీతావాహనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు ప్రారంభించారు. రోడ్డు పై చల్లాచెదురుగా ఉన్న వాహనాలను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పూర్తి వివరాలను తెలుసుకొని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపు నుంచి సహాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.