Beer Lorry: అసలే ఎండాకాలం.. ఎండల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఒళ్లు చల్లార్చుకోవటానికి కొంతమంది కూల్‌డ్రింక్స్‌ను ఆశ్రయిస్తుంటే.. మరికొంత మంది బీర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ దెబ్బతో మూడు నెలల్లో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. మండిపోతున్న రేట్లతో ఇబ్బందులు ఎదురవుతున్నా బీర్లను తాగటం మానటం ఆపటం లేదు బీర్ ప్రియులు. ప్రతీ రోజు ఓ బీరు గొంతులో దిగంది కొంతమందికి నిద్రపట్టని పరిస్థితి. అలాంటి వాళ్లకు ఫ్రీగా బీర్లు దొరికితే ఎలా ఉంటుంది?.. అది కూడా నడిరోడ్డుమీద.. అదిరిపోతుంది కదూ!.. బీర్లేంటి.. రోడ్డు మీద దొరకటమేంటి? అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదివేసేయండి.
ఆదివారం శ్రీకాకుళం జిల్లా నుంచి ఓ లారీ బీర్ల లోడుతో చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళుతోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్దకు రాగానే అదుపు తప్పి లారీ బోల్తా పడింది. దీంతో బీర్లన్నీ నేల పాలయ్యాయి. వీటిలో చాలా బీర్లు పగిలిపోయాయి. మరికొన్ని మిలమిల మెరుస్తూ రోడ్డుపై వెళుతున్న వారిని ఆకర్షించాయి. వాటిని చూసిన జనం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అందిన కాడికి బీర్లను తీసుకెళ్లటం మొదలుపెట్టారు.
బీర్ల గురించి తెలుసుకున్న వారంతా అక్కడికి చేరుకుని దొరికిన కాడికి చేతుల్తో పట్టుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడున్న పగిలిన బీర్లను జేసీబీతో క్లీన్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kakinada: ఏపీ పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వాయిస్ మెసేజ్!