ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను అధికారులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. అయితే ఏపీ నుంచి తీసుకొచ్చిన గవర్నర్ ను ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే హరిభూషణ్ కు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుండగా అసలు హరిభూషణ్ కు అస్వస్థకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి కొద్ది సేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలియజేయనున్నారు.