పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమితులైనట్లు ప్రకటన విడుదలైంది.
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమించినట్లు ప్రకటించారు. బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఏపీకీ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ను నియమించారు. జనవరి 4వ తేదీన జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయనను ఏపీ గవర్నర్ గా నియమితులైనట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. ట్రిపుల్ తలాఖ్ కేసును విచారించిన ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ సభ్యునిగా ఉన్నారు. అలాగే అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో కూడా అబ్దుల్ నజీర్ సభ్యునిగా ఉన్నారు.
ఇంక పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. మేఘాలయ కొత్త గవర్నర్ గా ఫాగు చౌహాన్, మహారాష్ట్ర కొత్త గవర్నర్ గా రమేష్ బాయిస్, సిక్కిం కొత్త గవర్నర్ గా లక్షణ్ ప్రసాద్ ఆచార్య, అరుణాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా త్రివిక్రమ్ పర్నాయక్, జార్ఖండ్ కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్, అస్సాం కొత్త గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ కొత్త గవర్నర్ గా అనసూయ, లడఖ్ కొత్త గవర్నర్ గా బి.డి.మిశ్రా, నాగాలాండ్ కొత్త గవర్నర్ గా గణేషన్ నియమితులైనట్లు ప్రకటించారు.
Justice (Retd.) S Abdul Nazeer appointed as Governor of Andhra Pradesh. Governor of Andhra Pradesh Biswa Bhusan Harichandan appointed as Governor of Chhattisgarh. Governor of Chhattisgarh Anusuiya Uikye appointed as Governor of Manipur.
— ANI (@ANI) February 12, 2023