ap assembly budget session : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆయనకు టీడీపీ సభ్యులు షాక్ ఇచ్చారు. ఆయన ప్రసంగం చేస్తుండగా ‘గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘రాజ్యాంగాన్ని కాపాడలేని గవర్నర్ గో బ్యాక్’ అంటూ అరవటం మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి ఆయనపై విసిరేశారు.
దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయినప్పటికి ఆయన తన ప్రసంగాన్ని ఆపలేదు. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. మార్చి 8న ఇటీవల గుండెపోటుతో మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అసెంబ్లీ సంతాప తీర్మానం చేసి నివాళులర్పించనుంది. మార్చి 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.