పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమితులైనట్లు ప్రకటన విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల నుంచే కాక.. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. యూనివర్శిటీ పేరు […]
ap assembly budget session : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆయనకు టీడీపీ సభ్యులు షాక్ ఇచ్చారు. ఆయన ప్రసంగం చేస్తుండగా ‘గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘రాజ్యాంగాన్ని కాపాడలేని గవర్నర్ గో బ్యాక్’ అంటూ అరవటం మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగ […]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్‌కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. […]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను అధికారులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. అయితే ఏపీ నుంచి తీసుకొచ్చిన గవర్నర్ ను ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే హరిభూషణ్ కు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుండగా అసలు హరిభూషణ్ కు అస్వస్థకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి కొద్ది సేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలియజేయనున్నారు.