ఆరోగశ్రీ సేవలు రేపటి నుంచి ఏపీలో బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలియజేసింది.
పేద రోగులకు భరోసా కల్పిస్తున్న అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకాన్ని దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఆయన ప్రారంభించిన ఈ పథకాన్ని తరువాత ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ వచ్చాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది పేద కుటుంబాల వారు ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ఆరోగశ్రీ సేవలు రేపటి నుంచి ఏపీలో బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి లేఖ ద్వారా తెలియజేసింది.
ఏపీలో పేద రోగులను రూపాయి ఖర్చులేకుండా ఆదుకుంటున్నాఆరోగ్య శ్రీ సేవలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ బకాయిలు భారీగా పేరుకుపోవడంతోనే ఈనిర్ణయం తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నాయి. బకాయిల విడుదల విషయంలో ఏపీ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈసేవలు నిలిపి వేస్తున్నట్లు ఆస్పత్రుల అసోషియేషన్ తెలిపింది. ఏపీలో ఆరోగ్యశ్రీ కింద ఏపీలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బకాయిలు రాకపోవడంతో సేవలు నిలిపివేయాలని జిల్లాల వారీగా ఏకగ్రీవ తీర్మానానికి ప్రైవేట్ ఆస్పత్రులు ఆమోదం తెలిపాయి.
గతంలోనే మే 1 నుంచే వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించగా.. ఈనెల 200 కోట్లు బకాయిల నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ. 2వేల కోట్లకుపైగా ప్రభుత్వం బకాయి పడిందని సమాచారం. ఈ బకాయిల కారణంగా ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించలేమని నెట్‌వర్క్ ఆస్పత్రులు స్పష్టంగా తెలియజేశాయి. ఈక్రమంలోనే రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.