ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగ సంస్థ బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చిత్తూరులో ఉన్న గనిలో ఏకంగా 18 లక్షల టన్నుల గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గనిని రూ. 500 కోట్లు చెల్లించి లీజుకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుత కాలంలో మరణాలు ఏ విధంగా వస్తున్నాయో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. ఎవరికీ ఏ రూపంలో మృత్యువు సంభవిస్తుందో అస్సలు చెప్పలేని పరిస్థితి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఇంట్లో, బయటే కాదూ వాహనాల్లోనూ మహిళకు రక్షణ కొరవడింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, హైదరబాద్ లో జరిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారాలు బస్సు, కారు వంటి వాహనాల్లోనే జరిగాయి. నిన్నటికి నిన్న ఓ రైడింగ్ యాప్ కు చెందిన బైక్ డ్రైవర్ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించిన షాక్ తగలగా.. తూర్పు రాయలసీమ ప్రాంతంలో.. మరీ ముఖ్యంగా కుప్పంలో వైసీపీ పుంజుకోవడంతో టీడీపీ శ్రేణులు షాకవుతున్నారు. ఆవివరాలు..
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించాడు. జనవరి 27న పాదయాత్ర ప్రారంభం అయ్యింది. శనివారం యువగళం పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజున కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా.. లోకేష్ గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర […]
చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. శుక్రవారం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సదంర్భంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో.. అచ్చెన్నాయుడు.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. కుప్పం ఎస్సై శివ కుమార్ ఫిర్యాదు చేశాడు. దాంతో అచ్చెన్నాయుడిపై కేసు నమోదయ్యింది. పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారని ఈ ప్రసంగంపై ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కుప్పం సభలో అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ.. […]
టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్న సమయంలో.. నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అనారోగ్యం కారణంగా తారకరత్న శరీరం నీలంగా మారడమే కాక.. సుమారు 45 నిమిషాల పాటు పల్స్ కూడా అందలేదని వైద్యులు తెలిపారు. తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయిందని వైద్యులు గుర్తించినట్లు బాలయ్య తెలిపారు. ఆయనకు స్టంట్ వేశామని వైద్యులు వెల్లడించారు. తారకరత్నకు […]
టీడీపీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి వారసుడు నందమూరి తారకరత్న కళ్లు తిరిగి కిందపడిపోవడం, ఆస్పత్రి పాలవ్వడం జరిగాయి. అయితే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు.. స్టంట్ వేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు.. తారకరత్నను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే సమయానికి అతని శరీరం బ్లూ కలర్ లోకి మారినట్లుగా వార్తలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో తారకరత్న శరీరం ఎందుకు బ్లూకలర్ లోకి […]
నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే.. ఈ ఘటన ఎలా జరిగిందన్నది తెలిసేలా పాదయాత్ర సీసీటీవీ విజువల్స్ బయటకొచ్చాయి. పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవ్వడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్న […]
టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర.. శుక్రవారం ఉదయం 11.03 నిమిషాలకు ప్రారంభమైంది. టీడీపీ నేతలు, వేలాది మంది కార్యకర్తలు.. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. కుప్పం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొనడం కోసం నందమూరి తారకరత్న కూడా వచ్చారు. లోకేష్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుప్పం మసీదులో లోకేష్, టీడీపీ నేతలు, తారకరత్న.. ప్రార్థనలు చేసి.. బయటకు వస్తుండగా.. ఉన్నట్లుండి తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను కుప్పం […]