టీడీపీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి వారసుడు నందమూరి తారకరత్న కళ్లు తిరిగి కిందపడిపోవడం, ఆస్పత్రి పాలవ్వడం జరిగాయి. అయితే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు.. స్టంట్ వేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు.. తారకరత్నను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే సమయానికి అతని శరీరం బ్లూ కలర్ లోకి మారినట్లుగా వార్తలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో తారకరత్న శరీరం ఎందుకు బ్లూకలర్ లోకి మారిందన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ విషయంపై.. ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ స్పందిస్తూ తారకరత్న శరీరం ఎందుకు బ్లూకలర్ లోకి మారిందన్న దానిపై వివరణ ఇచ్చారు.
తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు మొదట స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి.. ఆ తర్వాత మెరుగైన వైద్యం పీఎస్‌ఈ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పీఎస్‌ఈ వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ లు ఉన్నట్లు తెలిపారు. అనంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడిన వైద్యులు.. ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో పల్స్ లేవని.. తారకరత్న శరీరం నీలం రంగులోకి మారిందని వెల్లడించారు. వెంటనే చికిత్స అందించామని.. సుమారు 45 నిమిషాల వరకు పల్స్ అందలేదని.. ఆ తర్వాతే పల్స్ మొదలైందని తెలిపారు.
ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదు.. శరీరం బ్లూగా మారింది.. వెంటనే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాం.. 45 నిమిషాల తర్వాత పల్స్ మొదలైంది.. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నాం-వైద్యులు#NaraLokesh #NandamuriTarakaratna #TDP #AndhraPradesh
— NTV Breaking News (@NTVJustIn) January 27, 2023
తారకరత్న శరీరం నీలంగా మారడానికి కారణం.. అతని రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండడమే అని డాక్టర్ చెప్పుకొచ్చారు. ‘మనిషి శరీరంలో ఏయే అవయాలకు రక్తం అందకుండా ఉంటుందో ఆ అవయవాల చివరన అనగా.. చేతి వేళ్లు చివరన, కాలి వేళ్లు చివరన నీలం రంగులోకి మారతాయి. ఇప్పుడు తారకరత్న విషయంలో కూడా అదే జరిగింది. అతడి శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగలేదు.ఆ కారణంగానే బ్లూ కలర్ లోకి మారిందని..’ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తారకరత్న శరీరం నీలంగా మారడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. బ్లాక్‌లు ఉండటం వల్లే స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు ఎలాంటి స్టెంట్లు వేయలేదు, నెమ్మదిగా రికవరీ అవుతున్నారు. యాంజియోగ్రామ్ పూర్తైంది. అవసరమైతే బెంగళూర్‌కు హెలికాప్టర్‌లో తరలిస్తాం. -గోరంట్ల బుచ్చయ్య#BreakingNews
— NTV Breaking News (@NTVJustIn) January 27, 2023