మైక్‌ టైసన్‌ గురించి బయటపడ్డ సంచలన నిజాలు!

Miketyson Rudy Gonzalez

మైక్‌ టైసన్‌.. బాక్సింగ్ లేజండ్ గా అందరికి సుపరిచితులు. తన బాక్సింగ్ కెరియర్ లో ఎన్నో సంచలన విజయాలు సాధించి బాక్సింగ్ లో లేజండ్ గా ఎదిగారు. అతను రింగ్ లో ప్రవేశించాడా ఇక ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరగెట్టాల్సిందే. కానీ ఇదిలా ఉంటే ఇప్పుడు అతని గురించి అందరికీ తెలియని కొన్ని సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు ఏంటా సంచలన నిజాలనేదే కదా మీ ప్రశ్న. ఇక విషయం ఏంటంటే..? ముందుగా తను రింగ్ లో దిగేముందు ఉక్రోశం, ఉద్వేగం, దూకుడు స్వభావం కలిగి ఉంటాడు.

అయితే వీటిని తగ్గించుకునేందుకు మైక్‌ టైసన్‌ రింగ్ లో పాల్గొనే ముందు శృంగారంలో పాల్గొనేవాడని మైక్‌ టైసన్ మాజీ బాడీగార్డ్ రూడీ గోంజాలెజ్ సంచలన నిజాలు బయటపెట్టాడు. ఇక ఒకరు కాదు ఇద్దరు ఏకంగా అనేక మంది యువతులతో శృంగారంలో పాల్గొనేవాడని బాడీగార్డు తెలిపారు. ఇక ఇదే విషయంపై ఓ సారి మైక్‌ టైసన్‌ ని అడిగానని అతని చెప్పిన సమాధానాలు విని దిమ్మతిరిగిపోయిందని బాడీగార్డ్ రూడీ గోంజాలెజ్ తెలిపాడు. ఒకవేళ ఇలా శృంగారంలో పాల్గొనకపోతే రింగ్ లో తన ముందు ఉన్న ప్రత్యర్థులను చంపేస్తానన్న భయంతోనే ఇలా చేసేవాడినని మైక్‌ టైసన్‌ చెప్పినట్లుగా అతని మాజీ బాడీగార్డ్ రూడీ గోంజాలెజ్ స్పష్టం చేశాడు. ఇక మైక్‌ టైసన్‌ ప్రస్తుతం దర్శకుడు పూరిజగన్నాధ్ తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తుండడం విశేషం.