కరేబియన్‌ లీగ్‌ లో కట్టలు తెంచుకున్న ఆవేశం.. వీడియో వైరల్‌!

ఐపీఎల్‌కి ఉన్నంత క్రేజ్‌ కాకపోయినా.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి కూడా సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. పొట్టి క్రికెట్‌ అంటే ఆ మజానే వేరుంటది. థ్రిల్‌, ఛేజింగ్‌లతో ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు గురికావడం చూస్తేనే ఉంటాం. కొన్నిసార్లు ప్రత్యర్థులపై అయితే, మరికొన్నిసార్లు జట్టులోని తోటి సభ్యులపై కూడా కావచ్చు. సీపీఎల్‌ 17వ మ్యాచ్‌లో అదే జరిగింది. పాకిస్తాన్‌ ప్లేయర్‌ ఆసిఫ్‌ అలీ పనికి షెర్‌ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ రియాక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన పేట్రియాట్స్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్‌ మొదటి ఓవర్‌లోనే ఔట్‌ అవ్వడం, గేల్‌ కూడా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో బాధ్యత రూథర్‌ ఫోర్డ్‌, ఆసిఫ్‌ అలీ ద్వయంపై పడింది. ఈ జోడీ కాస్త నెమ్మదిగానే ప్రారంభించినా అప్పటికి కావాల్సిన డిఫెన్స్‌తో వికెట్‌ కాపాడారు. పదో ఓవర్‌లో అల్‌జారీ జోసఫ్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు.. రెండో బంతిని మిడ్‌ వికెట్‌ వైపు తరలించాడు రూథర్‌ఫోర్డ్‌. వేగంగా ఒక పరుగు తీసి.. రెండో పరుగు కోసం పరిగెత్తాడు. ఆసిఫ్ అలీ కనీసం తిరిగి చూడకుండా అటే ఉండిపోయాడు. మరి చూశాక అయినా ఆగకుండా షెర్‌ఫేన్‌ అదర్‌ ఎండ్‌కి వెళ్లిపోయాడు. నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో రన్‌ ఔట్‌ అయ్యాడు.

rutherford1 compressed

నాదేం ఉంది అన్నట్లు ఆసిఫ్‌ అలీ నిలిచున్నాడు. అప్పటి వరకు బాగానే వచ్చి.. బౌండ్రీ లైన్‌ దగ్గరకు రాగానే షెర్‌ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా హెల్మెట్‌ తీసి విసిరి కొట్టాడు. బ్యాట్‌, గ్లౌజ్‌ ఇలా అన్నీ తీసి విసిరికొట్టాడు. కరేబియన్‌ బ్యాట్స్‌మెన్‌లో మరో కోణం చూసి అభిమానులు, ప్రేక్షకులు అంతా అవాక్కయ్యారు. కెమెరాకి చిక్కిన ఆ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.