ధావన్ కు అర్జున అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి

Shikar Dhawan Got Arjuna Award - Suman TV

భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు అర్జున అవార్డు ప్రదానం చేశారు. జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి అవార్డును అందించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ర్టపతి భవన్‌లో అట్టహాసంగా నిర్వహించారు. 2021లో మొత్తం 62 మందికి అవార్డులను రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. అదే విధంగా భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులను.. టోక్యో ఒలింపిక్‌ బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా, భారత క్రికెటర్‌ మిథాలీ రాజ్‌తో పాటు పలువురు క్రీడాకారులకు ప్రదానం చేశారు.

Shikar Dhawan Got Arjuna Award 03 compressed