ఆఖరి బంతికి సిక్స్ కొట్టి, తమిళనాడుకి టైటిల్ అందించిన షారూఖ్ ఖాన్!

Sharukkhan Dhoni Tamilnaadu

ఇండియన్ క్రికెట్ డొమెస్టిక్ లెవల్ లో చాలానే టోర్నీలు ఉంటాయి. కానీ.., అలాంటి మేజర్ టోర్నీలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చాలా ముఖ్యమైంది. మన యువ ఆటగాళ్ల సత్తాకి ఈ టోర్నీ వేదికగా నిలుస్తూ వస్తోంది. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్ తమిళనాడు ఈసారి కూడా కప్ ని ఎగరేసుకుపోయింది. కానీ.., తమిళనాడు ఫైనల్ గెలిచిన విధానమే ఇప్పుడు అందరిని ఆకట్టుకుంది. విజయ్ శంకర్ నేతృత్వంలోని బరిలోకి దిగిన తమిళనాడు మొత్తం టోర్నీలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఫైనల్ కి చేరుకుంది. మరోవైపు మనీశ్ పాండే నేతృత్వంలోని కర్ణాటక జట్టు కూడా మెరుగైన ఆట తీరుతో ఫైనల్ కి చేరుకుంది.

సోమవారం జరిగిన ఉత్కంఠ ఫైనల్లో ఆఖరి బంతికి విజయాన్నందుకుంది తమిళనాడు. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్ షారూఖ్ ఖాన్ సూపర్ సిక్స్‌తో మ్యాచ్ ని ముగించడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్ చేసింది.

కష్టతరం గాని లక్ష్య చేధనతో బరిలోకి దిగిన దిగిన తమిళనాడుకి మంచి ఆరంభం లభించింది. కానీ.., మిడిల్ ఓవర్స్ టైట్ కావడంతో తమిళనాడు విజయానికి ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం అయ్యాయి. కానీ.., లెగ్ సైడ్ పడ్డ బంతిని షారూఖ్ ఖాన్ భారీ సిక్స్ కొట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో.. తమిళనాడు మరోసారి విజేతగా నిలిచింది. అయితే.., ఈ మ్యాచ్ ని మిస్టర్ కూల్ ధోని టీవీలో చూసిన విజువల్స్ బయటకి వచ్చాయి. దీంతో.. షారూఖ్ నువ్వు ధోని భాయ్ కళ్ళలో పడ్డావు. ఇకపై నీ రాత మారిపోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, షారూఖ్ ఖాన్ ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మరి.. షారూఖ్ ఖాన్ పవర్ హిట్టింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.