మ్యాచ్‌ మధ్యలో జెమీసన్‌ ప్రేమాయణం

navnita gautam

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య సోమవారం అబుదాబిలో జరగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తి కర దృశ్యం కనిపించింది. అది సోషల్‌ మీడియోలో తెగ వైరల్‌ అవుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి జట్టు శిబిరమంతా నిరాశలో మునిగిపోయింది. ఒక బ్యాట్స్‌మెన్‌ మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. వెనకాల కూర్చున్న అందమైన అమ్మాయితో చూపులు కలుపుతూ కళ్లతోనే సందేశాలు ఇస్తున్నాడు. ఆ జట్టు థెరపిస్ట్‌ అయిన ఆ అమ్మాయి సైతం అతని చూపులకు నవ్వుతో సమాధానం ఇస్తుంది. ఈ లైవ్‌ ట్రాక్‌ నడిచింది ఆర్సీబీ జట్టు సభ్యుడు కైల్‌ జెమీసన్‌, అదే జట్టు థెరపిస్ట్‌ స్టాఫ్‌ నవ్‌నీత్‌ గౌతమ్‌ మధ్య. ఒక వైపు ఆర్సీబీ వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో ఉంటే జెమీసన్‌ ముగసైగలు కెమెరా కంటికి చిక్కాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్లో హల్‌చల్‌ చేస్తుంది.