ఋతురాజ్ గైక్వాడ్.. ఈ ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించి, ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్న యువ క్రికెటర్. ప్రతి మ్యాచ్ లో గైక్వాడ్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ పై కోట్ల వర్షం కుమ్మరించడానికి ఫ్రాంచైజీలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి.. ఒకేఒక్క సీజన్ తో ఇన్ని అద్భుతాలు సృష్టించిన ఋతురాజ్ కి ఎంత దిష్టి తగిలి ఉంటుంది? అందుకే అతని తల్లి దిష్టి తీసి మరి తన కొడుకుకి ఇంటికి స్వాగతం చెప్పింది.
ఐపీఎల్-2021 టైటిల్ ని చెన్నై గెల్చుకోవడంలో కీలక పాత్ర పోచించాడు ఋతురాజ్ గైక్వాడ్. ఎంతో సంతోషంతో దుబాయ్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌కు తన తల్లి సాంప్రదాయ స్వాగతం పలికారు. ఎర్ర నీళ్లతో తన బిడ్డకి దిష్టి తీసి, ఆ తల్లి ఋతురాజ్ ని ఇంట్లోకి ఆహ్వానించింది. ఈ సమయంలో ఋతురాజ్ కి వెల్కమ్ చెప్పడానికి అక్కడికి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు.
సాధారణ మధ్య తరగతి నుండి క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు ఋతురాజ్ గైక్వాడ్. గత వేలంలో అతన్ని చెన్నై కేవలం రూ.20 లక్షలకే దక్కించుకోవడం విశేషం. మరి.. రానున్న మెగా ఆక్షన్ లో ఋతురాజ్ గైక్వాడ్ ని ఏ టీమ్ దక్కించుకుంటే బెటర్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mersal Arasan 🔙 Home 💛#WhistlePodu #Yellove 🦁 @Ruutu1331 pic.twitter.com/SlOFnkvF9o
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021