ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై జట్టులోకి మరో స్టార్ క్రికెటర్ వచ్చి చేరాడు. జెమీసన్ స్థానంలో అతడిని ఎంపిక చేశారు. మార్చి 31 నుంచి తాజా సీజన్ మొదలుకానుంది.
ఐపీఎల్ ప్రారంభానికి ముందే వరసగా చాలా జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయా జట్లలోని కొంతమంది స్టార్ ప్లేయర్స్ గాయాల కారణంగా మొత్తం సీజన్ కే దూరమవుతున్నారు. ఇప్పటికే బుమ్రా, జే రిచర్డ్ సన్ (ముంబై ఇండియన్స్), శ్రేయస్ అయ్యర్ ( కోల్ కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్, హేజిల్ వుడ్ (బెంగుళూరు), ప్రసిద్ధ్ కృష్ణ (రాజస్థాన్ రాయల్స్), రిషబ్ పంత్ , అన్రిచ్ నోకియా, సర్ఫరాజ్ ఖాన్ ( దిల్లీ క్యాపిటల్స్) గాయాల వల్ల టోర్నీ మొత్తానికి దూరమవ్వగా.. బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ కైల్ జెమీసన్ కూడా ఐపీఎల్ తాజా సీజన్ కు పూర్తిగా దూరం కానున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ ప్రారంభం నుంచి సక్సెస్ ఫుల్ జట్టు అనగానే చెన్నై సూపర్ కింగ్స్ అని చాలామంది గుర్తుపట్టేస్తారు. 4 సార్లు ట్రోఫీ గెలుచుకున్న ధోనీ టీమ్.. ముంబయి ఇండియన్స్ తర్వాత ఎక్కువ టైటిల్స్ అందుకున్న జట్టుగా ఉంది. ఇప్పుడు ఆ జట్టుకి స్టార్ బౌలర్ జెమీసన్ గాయం కారణంగా దూరం కానుండడం చెన్నై జట్టుని ఆందోళనకి గురి చేస్తుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ కివీస్ ఫాస్ట్ బౌలర్ ని కనీస ధర కోటి రూపాయలకు చెన్నై జట్టు దక్కించుంది. జెమీసన్.. బౌలింగ్ తో పాటు లోయరార్డర్ లో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇప్పుడు ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ సేవలను కోల్పోవడం చెన్నైకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతడి స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మగలాని జట్టులోకి తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా కి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ని చెన్నై జట్టు రూ.50 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. అంతర్జాతీయ కెరీర్ లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ.. దేశవాళీ క్రికెట్ లో మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 127 మ్యాచులాడిన మగలా.. 136 వికెట్లు తీశాడు. తొలిసారి జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో.. ఈస్టర్న్ కేప్ తరపున 12 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఈ నెల 31న గుజరాత్, చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ మొదలవనుండగా.. మగలాకి స్థానం దక్కుతుందో లేదో చూడాలి. ఒకవేళ తుది జట్టులో అవకాశం లభిస్తే ఏ మాత్రం ప్రభావం చూపించగలడో అనేది తెలియాల్సి ఉంది. మరి జెమీసన్ బదులు మగలాని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Magizhchi, Magala! Roar proud. 🥳#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Hn3A94CcFa
— Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2023