ఐపీఎల్‌- 2022లో పాల్గొనడంపై ధోనీ క్లారిటీ..

Dhoni Ipl 2021

‘ఐపీఎల్‌- 2022’పై ఇప్పట్నుంచే ఊహాగానాలు, ప్రిడిక్షన్స్‌, పుకార్లు మొదలై పోయాయి. మెగా ఆక్షన్‌ ఎప్పుడు, ఏ టీమ్ ఎవర్ని రిటైన్‌ చేసుకుంటుంది? ఈ సారి ఆ ప్లేయర్‌ ఏ జట్టులో ఉంటాడు అంటూ ప్రశ్నలు, అనుమానాలు, ఊహాగానాలు అన్నీ జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్‌ 14 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ విషయంలోనూ అలాంటి ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. అతను వచ్చే వేలంలో ఉండడని కొందరు, వేరే జట్టు కెప్టెన్‌ అవుతాడని మరికొందరు చెప్పుకుంటున్నారు. అసలు ఆడతాడో లేదో అనేది ప్రధాన ప్రశ్న అందుకు కెప్టెన్‌ కూలే స్వయంగా సమాధానం ఇచ్చాడు.

ఇండియా సింమెంట్స్‌ 75 సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న ధోనీని అడిగిన ప్రశ్న.. వచ్చే ఐపీఎల్‌లో సంగతి ఏంటని. అందుకు కెప్టెన్‌ కూల్‌ ఎప్పటిలాగానే చాలా కూల్‌ గా ‘ వచ్చే ఐపీఎల్‌ లో పాల్గొనే విషయం గురించి ఆలోచిస్తాను. పీఎల్‌ జరిగేది ఏప్రిల్‌ లో.. ఇంది ఇంకా నవంబరేగా ఇంతా టాసా సమయం ఉంది’ అంటూ ఎంతో కూల్‌ గా రెస్పాండ్‌ అయ్యాడు. అయితే చెన్నై మాత్రం ధోనీ ఐపీఎల్‌ ఆడితే కచ్చితంగా మేం రిటైన్‌ చేసుకుంటామని గతంలోనే చెప్పింది. మారిన రిటైన్‌ నియమాల ప్రకారం.. ఏ ప్లేయర్‌ ఏ టీమ్‌ లో ఉంటాడు అనే విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొంది. కొత్తగా రెండు ఫ్రాంచైజీలు రానున్న నేపథ్యంలో ప్లేయర్లు చాలా మంది టీమ్‌ లు మారే పరిస్థితి ఉంటుంది. ధోనీ వచ్చే ఐపీఎల్‌ లో పాల్గొంటే బావుంటుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.