డేవిడ్ వార్నర్.. ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనంగా మారింది. వరల్డ్ కప్ కి ముందు ఫామ్ కోల్పయి ఇబ్బందులు పడ్డ వార్నర్.. టీ 20 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే వార్నర్.. గతంలో తనకి సన్ రైజర్స్ టీమ్ లో ఎదురైన అవమానాల పై తొలిసారి నోరు విప్పాడు.సన్ రైజర్స్ టీమ్ తో డేవిడ్ వార్నర్ ది విడతీయలేని సంబంధం. చాలా కాలంగా ఈ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్.. 2016లో ఆ జట్టుని విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గా, ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఆ సీజన్ లో విశ్వ రూపం చూపించాడు.
తరువాత కాలంలో కూడా సన్ రైజర్స్ తో వార్నర్ బంధం ఇలానే కొనసాగుతూ వచ్చింది. కానీ.., గత సీజన్ లో డేవిడ్ వార్నర్ ఫామ్ కోల్పోయాడు. ఆ సమయంలో వార్నర్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరుపై చాలానే విమర్శలు వినిపించాయి. ఛాంపియన్ ఆటగాడైన వార్నర్ కి సన్ రైజర్స్ యాజమాన్యం నుండి అవమానాలు సైతం ఎదురయినట్టు టాక్ వినిపించింది. అయితే.., ఇంతకాలం ఈ విషయంలో కామ్ గా ఉండిపోయిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు తొలిసారి స్పందించాడు.
“కొన్నేళ్ల పాటు అమితంగా ఇష్టపడిన జట్టు ఉన్నటుండి ఏ కారణం లేకుండా నన్ను కెప్టెన్సీ నుండి తొలగించింది. తరువాత టీమ్ లో ప్లేస్ కూడా ఇవ్వకుండా అవమానించింది. ఈ విషయాలు నన్ను చాలా బాధ పెట్టాయి. కానీ.., ఈ అంశాలపై నేను ఎలాంటి ఫిర్యాదులు చేయాలకోవడం లేదు. భారత్ లో నాకెంతో మంది అభిమానులు ఉన్నారు. వారు నాకు ఎల్లప్పుడు అండగా నిలిచారు. వాళ్ల కోసమే నేను ఆడుతున్నా, వారిని ఎంటర్ టైన్ చేయడానికే నేను ఉన్నాను.
ఆ ప్రాంఛైజీ కోసం నేను చాల కష్టపడ్డాను. ఎవరైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటారు. రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసినప్పటికీ, సరైన సమయంలో పరుగులు చేయలేకపోయాను. అంతలా జట్టు కోసం కష్టపడినప్పటికి నన్ను తీసేయడం చాలా బాధ కలిగించింది. నాకింకా ఐపీఎల్ ఆడేందుకు మరొ అవకాశం ఉందని నమ్ముతున్నా” అని డేవిడ్ వార్నర్ తన మనసులోని బాధని బయటపెట్టాడు. సన్ రైజర్స్ పై వార్నర్ ఎలాంటి కామెంట్స్ చేశాడో చూశారు కదా? మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.