కొన్ని లక్షల సార్లు డైరీలో రాసుకున్నా!. అశ్విన్ భావోద్వేగ ట్వీట్!..

Ashwin emotional tweet - Suman TV

టీ20 ప్రపంచ కప్ 2021 కోసం బుధవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో సీనియర్ ఆడగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అశ్విన్ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో కొంత భావోద్వేగానికి గురవుతూ ట్వీట్ చేశాడు. “ప్రతీ చీకటి వెనుక వెలుగు తప్పక ఉంటుంది. అయితే ఆ వెలుతురు చూడగలనని నమ్మినవాడే ఆ చీకటి ప్రయాణాన్ని తట్టుకుని నిలబడతాడు.” అనే కోట్ ను షేర్ చేస్తూ.. సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలు తనేంటో నిర్వచిస్తాయని ఆశ్విన్‌ అన్నాడు. ఈ కోట్‌ను గోడమీద పెట్టక ముందే నా డైరీలో కొన్ని లక్షలు సార్లు రాసుకున్నాను. మనం చదివే మంచి మాటలను తప్పని సారిగా పాటిస్తే జీవితంలో ఏదో ఒక చోట మనకు ప్రేరణ కలిగిస్తాయని అశ్విన్‌ అంటున్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న అశ్విన్‌.. మెదటి నాలుగు టెస్టులకు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కాగా ఆశ్విన్‌ చివరసారిగా 2017లో టి20 మ్యాచ్‌ ఆడాడు. 46 టీ20ల్లో 52 వి​కెట్లు ఆశ్విన్‌ పడగొట్టాడు

Ashwin emotional tweet - Suman TV