పాకిస్తాన్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. షాక్‌లో అభిమానులు

Rohit Sharma in Pakistan - Suman TV

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ పాకిస్తాన్‌లో దర్శనమిచ్చాడు. యూఏఈలో ఐపీఎల్‌ ఆడుతున్న రోహిత్‌ పాకిస్తాన్‌ ఎందుకు వెళ్లాడా అని ఆలోచిస్తున్నారా? నిజంగానే రోహిత్‌ శర్మ పాకిస్తాన్‌ వెళ్లలేదు. అచ్చం రోహిత్‌ లాగే ఉన్న ఓ వ్యక్తి ఫోటో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎవరన్నారూ మా దేశానికి క్రికెట్‌ ఆడేందుకు ఎవరూ ముందుకు రాట్లేదని.. చూడండి టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ మా దేశంలోనే ఉన్నాడంటూ ‘సిరాజ్‌ హసన్‌’ అనే పాకిస్తాన్‌ జర్నలిస్టు తన ట్వీట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దానికి కారణం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సేమ్‌టూసేమ్‌ హిట్‌ మ్యాన్‌లానే కళ్లాద్దాలు పెట్టి టోపి పెట్టుకుని రోహిత్‌శర్మేనా అన్నట్లు భ్రమపడేలా ఉన్నాడు. మీరూ ఓ లుక్కేయండి..