తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ నటించిన లస్ట్ స్టోరీస్ 2 మూవీ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ కి సూటయ్యే కంటెంట్ లేకపోయినా గానీ మిగతా వర్గాలు ఈ సిరీస్ ని బాగా ఆదరించాయి. ఈ కారణంగా సీజన్ 2 కూడా తీసే పరిస్థితి వచ్చింది. మొదటి సీజన్ లో రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్, కియారా అద్వానీ, నేహా ధూపియా వంటి హీరోయిన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రెండో సీజన్ లో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ వంటి హీరోయిన్స్ నటించారు. ఈ సిరీస్ లో తమన్నా ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అనే విషయం లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. వరుసగా బోల్డ్ కంటెంట్ ని ఎంచుకుంటున్న తమన్నా ఇటీవల జీ కర్దా వెబ్ సిరీస్ తో సందడి చేసింది. ఈ సిరీస్ లో తమన్నా ఓ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 తో నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన లస్ట్ స్టోరీస్ 2 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
నాలుగు కథలతో కూడిన ఆంథాలజీ సినిమా ఇది. మొదటి కథలో సె*క్స్ అంటే సిగ్గుపడిపోయే జంటకు దాని పరమార్థం గురించి ఒక బామ్మ వివరిస్తుంది. తన మనవళ్లకి విలువైన పాఠాలను నేర్పుతుంది. రెండో కథ.. యజమాని, పనిమనిషికి సంబంధించింది. పనిమనిషి తన భర్తతో కలిసి సె*క్స్ లో పాల్గొనడం చూస్తుంది. మూడవ కథ.. పెళ్ళై పోయిన వ్యక్తితో సంబంధం పెట్టుకునే యువతి కథ. నాల్గవ కథ ఒక పక్క భర్త తన కామవాంఛతో విసిగిస్తుంటే.. మరో పక్క ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు డిజప్పాయింట్ చేస్తాడు. ఇలా ఒక భర్త, కొడుకులు మధ్య నలిగిపోయే స్త్రీ కథ. ఈ నాలుగు కథలూ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. లస్ట్ స్టోరీస్ కంటే ఇంకాస్త బోల్డ్ గా ఉంటుంది ఈ సీజన్ 2. కొంతమందికి నచ్చకపోవచ్చు.
మొదటి సెగ్మెంట్, లాస్ట్ సెగ్మెంట్ మిగతా రెండు సెగ్మెంట్స్ కంటే బాగుంటాయి. మొదటి సెగ్మెంట్ మృణాల్ ఠాకూర్ కథ. నీనా గుప్తా మృణాల్ ఠాకూర్ బామ్మగా నటించింది. వేద (మృణాల్ ఠాకూర్), అర్జున్ (అంగద్ బేడీ) లకు మ్యారేజ్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తుంది. వేద, అర్జున్ ఈ ఇద్దరూ పెళ్ళికి సిద్ధమవుతారు. ఆ సమయంలో ఈ పెద్దావిడ వాళ్ళను సె*క్స్ లో పాల్గొన్నారా అని అడుగుతుంది. దానికి వారు సిగ్గుపడిపోతారు. అయితే మీరు కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేయకండి అంటూ చమత్కరిస్తుంది. ఆ తర్వాత ఆ బామ్మ వేదకి అమూల్యమైన పాఠాలను నేర్పుతుంది. ఈ క్రమంలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన ఉదాహరణలు చెబుతుంది.
రెండవ సెగ్మెంట్ తిలోత్తమ షోమ్, అమృత సుభాష్ లకి సంబంధించింది. ఈ సెగ్మెంట్ చాలా సిల్లీగా ఉంటుంది. తన పని మనిషి (అనుష్క కౌశిక్) ఆమె భర్తతో సె*క్స్ లో పాల్గొనడాన్ని చూస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో ఉన్న ఇంటిలో కోరిక తీర్చుకునేందుకు ప్రైవసీ దొరకడం లేదని పనిమనిషి ఇంటి యజమాని అయిన షీతా (తిలోత్తమ షోమ్) బెడ్ రూమ్ ని వాడుకుంటుంది. యజమాని పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆమె భర్తతో సె*క్స్ లో పాల్గొంటుంది. ఒకరోజు సడన్ గా మధ్యాహ్నం సమయంలో షీతా ఇంటికొచ్చి చూస్తే పనిమనిషి యవ్వారం కనబడుతుంది. అద్దం లోంచి చూసి ఆస్వాదిస్తుంటుంది. కానీ ఇది సహజంగా ఉండదు. వాస్తవ పరిస్థితులకు ఇది దూరంగా ఉంటుంది.
మూడవ సెగ్మెంట్ తమన్నా, విజయ్ వర్మలకు సంబంధించింది. తమన్నా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో సె*క్స్ లో పాల్గొనడం. ఈ సెగ్మెంట్ చాలా నాశిరకంగా ఉంటుంది. పాత్రల పెర్ఫార్మెన్స్ కూడా అంత సహజంగా ఉండదు. నాల్గవ సెగ్మెంట్ కాజోల్, కుముద్ మిశ్రాలకు సంబంధించింది. ఇందులో కాజోల్ దేవయాని సింగ్ పాత్రలో నటించగా.. కుముద్ మిశ్రా సూరజ్ సింగ్ పాత్రలో నటించారు. దేవయాని తన భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఉంటుంది. సూరజ్ కి బాగా కోరికలు ఎక్కువ. ఇంట్లో పనిమనిషి ఒంటరిగా ఉంటే వదిలి పెట్టడు. వీరి కొడుకు ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాడు. అందుకు దేవయాని సంతోషిస్తుంది. అయితే ఆమె తన చుట్టూ జరుగుతున్న దాన్ని గ్రహించలేకపోతుంది. ఈ సెగ్మెంట్ క్లైమాక్స్ లో వచ్చే సర్ప్రైజ్ దేవయానిని షాక్ కి గురి చేస్తుంది. ఆ సర్ప్రైజింగ్ షాక్ ఏంటో తెలియాలంటే లస్ట్ స్టోరీస్ 2 చూడాల్సిందే.
మొదటి సెగ్మెంట్ లో మృణాల్ ఠాకూర్ బామ్మగా నటించిన నీనా గుప్తా బాగా నటించారు. తన మనవరాలికి, మనవడుకి సె*క్స్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెప్పిన విధానం బాగుంటుంది. ఆ పాత్రలో ఆమె బాగా నటించారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ పక్కన పెడితే ఆమె నటన బాగుంది. సెక్స్ లేకపోతే ప్రేమ నిలబడదు అని చెప్పే పాత్ర ఈమెది. నాల్గవ సెగ్మెంట్ లో అన్యాయానికి గురయ్యే దేవయాని పాత్రలో కాజోల్ బాగా నటించింది. మిగతా సెగ్మెంట్స్ లో నటించిన వారి పాత్రలు అంత గొప్పగా ఏమీ ఉండవు. తమన్నా మాత్రం బోల్డ్ సీన్స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. నటనను నిరూపించుకునే పాత్ర అయితే కాదు.
కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు అబోవ్ యావరేజ్ గా ఉన్నాయి. నాశిరకమైన కంటెంట్ తో లస్ట్ స్టోరీస్ బ్రాండ్ ని వాడుకుని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. ఆర్. బాల్కి, సుజయ్ ఘోష్ ల పని తీరు బాగుంది. అమిత్ ఆర్. శర్మ, కొంకణ సేన్ శర్మల రైటింగ్ స్కిల్స్ ఆకట్టుకోవు.
రేటింగ్: 2.5/5
చివరి మాట: లస్ట్ స్టోరీస్ 2 సీజన్ నంబర్ కి తగ్గట్టే రెండు కథలే బాగున్నాయి.