పవన్‌కళ్యాణ్‌పై పోసాని మరోసారి రెచ్చిపోయారు. రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్‌కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మి దానిపై బ్యాంకులోన్లు మరిన్ని పొంది ఏపీని అప్పుల పాలు చేస్తారని విమర్శించడంపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. ఆయనపై పవన్ కళ్యాణ్ అభిమానలు ఫోన్లు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయన మంగళవారం ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ ‘నీ తమ్ముడిని అదుపులో పెట్టుకోలేవా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా పలు విషయాలపై స్పందించారు.
రాజకీయాలలో ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, ఆయన అభిమానులతో మాపై ఈ విధంగా మాటాల దాడి చేయిస్తుంటే పవన్ కంట్రోల్ చేయాలని చిరంజీవిని కోరారు. ఈ క్రమంలో పోసాని కాస్తా ఆవేశానికి గురయ్యారు. తీవ్ర భావోద్వేగంతో పరుషపదజాలం ఉపయోగించారు. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను వేధిస్తే దానికి పవన్‌కళ్యాణ్ ఏం చేస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.