పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

anilkumaryadav pawankalyan ap

శనివారం రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక పవన్ వ్యాఖల్యపై ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా స్పందించారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటే అని అన్నారు అనిల్ కుమార్. ఆన్ లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో చర్చించారని తెలిపారు.

ఆన్ లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయమని, దాని వల్ల జరిగే నష్టం ఏమిటి. ? అంటూ ప్రశ్నించారు మంత్రి అనిల్ కుమార్. పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్ రావాలని సీఎం కోరకుంటున్నారని అన్నారు. ఇక అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశమని సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురు మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంత వరకు సబబు అంటూ మంత్రి ప్రశ్నించారు. ఇక నా ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు అనిల్ కుమార్.

anilkumaryadav pawankalyan ap

ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ మాత్రమే. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి అస్సలు లేదని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మాట్లాడుతూ జగన్ చిత్ర పరిశ్రమనoతా ఇబ్బంది పెడుతున్నాడని ఒక ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు, రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందంటూ హెచ్చరించారు మంత్రి. దీంతో పాటు ప్రభుత్వ తీరును మారుస్తాను, నేను రోడ్డు కొస్తే మనిషిని కాదు, బెండు తీస్తాం అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదివరకే చాలా చూశామన్నారు. ఇక రాబోయే రోజుల్లో పవన్ పార్టీ చాప చుట్టేయటం ఖాయమన్నారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.