ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ధర్నాను మొదలు పెట్టింది. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాను చేపట్టింది. ఈ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది.
ఇక ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై ఈ పోరాటం ఆరంభం మాత్రమే అని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై మా ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామంటూ తెలిపారు. రాష్ట్రంలోని రైతుల పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు వ్యతిరేకంగా ఉందని ఆయన అన్నారు. ఇక ధర్నా అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులతో సహా వినతి పత్రాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఇవ్వనున్నారు.