ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ధర్నాను మొదలు పెట్టింది. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాను చేపట్టింది. ఈ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై ఈ పోరాటం ఆరంభం మాత్రమే […]