చనిపోయాక వైరస్ స్ప్రెడ్ కాదు! డెడ్ బాడీని ముద్దాడి చూపించిన అన్నం శ్రీనివాసరావు గారు!

దేశంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా కరోనా వార్తలే. అందులో కొన్ని నిజాలు. మరి కొన్ని అపోహలు. ఇలాంటి విపత్కర సమయంలో నిజాల కన్నా.., అపోహలు ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా ట్రీట్మెంట్ లో వాడే మెడిసిన్ నుండి, హోమ్ క్వారెంటైన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అన్నిట్లో ఇలాంటి అపోహలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ కరోనాతో చనిపోయిన మృతదేహం నుండి కూడా వైరస్ వైరస్ వ్యాప్తి జరుగుతుందన్న అపోహ ఇప్పుడు చాలా సమస్యలకు కారణం అవుతోంది. ఇన్నాళ్లు మనతో పాటు కలసి పెరిగిన వారు.. కరోనా కారణంగా చనిపోతున్నారు. అయితే.., వారి శవాలని పట్టుకుంటే ఎక్కడ తమకి కూడా వైరస్ సోకుతుందేమో అనే భయం చాలా మందిలో ఉంది. దీనితో ప్రజలు సొంతవారి అంత్యక్రియలకి కూడా హాజరు కావడం లేదు. తమ తరువాతి తరాల వారి కోసం వందల కోట్ల ఆస్తులను సంపాదించి.., జీవితపు చివరి యాత్రలో మాత్రం అనాధ శవాలుగా మిగిలిపోతున్న అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. నిజానికి.. చనిపోయిన వారి బాడీస్ నుండి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేసింది లేదు. కానీ.., డెడ్ బాడీస్ నుండి కూడా వైరస్ సోకుతుందేమో అనే భ్రమలో మనలో చాలా మంది జీవిస్తున్నారు. ఈ భయాలను, అనుమానాలను పటా పంచలు చేయడానికి అన్నం సేవా ఫౌండేషన్ ఛైర్మెన్ అన్నం శ్రీనివాసరావు గారు ఓ పెద్ద సాహసమే చేశారు.

రీసెంట్ గా కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి బాడీని అన్నం శ్రీనివాసరావు గారు అందరి సమక్షంలో కౌగిలించుకున్నారు. అంతేకాక.., ప్రజల్లో అనుమానాలను, అపోహలను పోగొట్టడానికి ఆ డెడ్ బాడీని ముద్దాడారు. చనిపోయిన వ్యక్తి శరీరం నుండి వైరస్ వ్యాప్తి జరగదని నిరూపించడానికే అన్నం శ్రీనివాసరావు గారు ఈ ప్రయత్నం చేశారు. అన్నం శ్రీనివాసరావు గారు జనహితం కోసం చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి వైద్య నిపుణులు గతంలోనే చేసిన కొన్ని సూచనలను జాగ్రత్తగా అర్ధం చేసుకుంటే ఈ విషయం నిజమని అర్ధం అవుతుంది. మనిషి శరీరంలో ఉండే ఏ వైరస్ అయినా.. 72 నుండి 96 గంటల వరకు మాత్రమే శరీరంలో బతికి ఉంటుంది. ఈ సమయంలో వాటికి మన ఆర్గాన్స్ ఆహరం. కానీ… ఆ సమయంలో వైరస్ కి స్ప్రెడ్ అయ్యే అంత శక్తి ఉండదు. కేవలం శరీరం లోపలే అలానే ఉండిపోతాయి. తరువాత సమయంలో శరీరంలోని ఆ వైరస్ కూడా చనిపోతుంది. కాబట్టి.., ఒక్క కరోనా వైరస్ మాత్రమే కాదు.., ఎలాంటి వైరస్ కూడా చనిపోయిన వ్యక్తి శరీరం నుండి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఇదే విషయాన్ని అన్నం శ్రీనివాసరావు గారు ప్రాక్టికల్ గా చేసి చూపించడంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంశలు కురిపిస్తన్నారు. నిజానికి అన్నం శ్రీనివాసరావు గారు ముందు నుండి సామజిక బాధ్యతని విడవకుండానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఖమ్మం వేదికగా ఆయన అన్నం సేవ ఫౌండేషన్ ని నడిపిస్తున్నారు. శ్రీనివాసరావు గారు ఛైర్మెన్ గా ఉన్న ఈ అనాధ శరణాలయంలో వృద్దులు, వికలాంగులు, దివ్యాంగులు కొన్ని వందల మంది ఆశ్రయాన్ని పొందుతున్నారంటే అన్నం శ్రీనివాసరావు గారి సేవా గుణాన్ని అర్ధం చేసుకోవచ్చు. అన్నం సేవ ఫౌండేషన్ ఇంతటి మంచి కార్యక్రమాలని నిర్వహిస్తోంది కాబట్టే.. సుమన్ టీవీ కొన్ని నెలల క్రితమే ఎక్సక్లూజిప్ గా వీరి కార్యక్రమాలను ప్రజల ముందుకి తీసుకొచ్చింది. ఏదేమైనా.. ప్రజల్లో అపోహలను పోగొట్టడానికి అన్నం శ్రీనివాసరావు గారు చేసిన ఈ కార్యక్రమం నిజంగా ప్రశంసనీయం.