తెలంగాణలో పురుడుపోసుకున్న నూతన పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంచి జోరు మీద ఉన్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలోని బలమైన పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్‌పెడితే. వైఎస్ షర్మిల మాత్రం ఏకంగా 2023 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. హుజూరాబాద్ బై ఎలక‌్షన్ ఇప్పుడే నిర్వహించమని ఎలక‌్షన్ కమిషన్ స్పష్టం చేసినప్పటికీ ప్రధాన పార్టీలు మాత్రం తమ పట్టు అక్కడ నిలుపుకునేందుకు ప్రయత్నాలు ఆపడం లేదు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. దళిత భేరి సభలతో జనంలోకి వెళ్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూర్యాపేట జిల్లాలో జరిగిన దళితభేరి సభలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నను ప్రకటించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ గెలుపోందారు.