భర్త కోసం భార్య భిక్షాటన.. బిచ్చగాడు సినిమాని మించే రియల్ స్టోరీ

భార్య.. పేరుకి రెండు అక్షరాలే అయినా, ఒక జీవితం మొత్తానికి సరిపోయే తోడు ఆమె. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, పెళ్లయ్యాక తన సర్వస్వము భర్తే అని బతికేసే నిస్వార్ధ బంధం ఆమెది. పుట్టింట్లో అల్లారుముద్దుగా పెరిగినా, భర్త దగ్గర ఎన్ని ఇబ్బందులు పడటానికైనా ఆమె సిద్ధంగా ఉంటుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనే శ్లోకాన్ని ప్రతి క్షణం నిజం చేస్తూ.. జీవించే ఆమె ప్రేమ ముందు ఎవ్వరూ సరిపోరు.

A Wife Begging For Husband Health - Suman TVఅయితే.. అంతా బాగున్నప్పుడు మాత్రమే కాదు. కష్టాల్లో కూడా తన భర్త వెన్నంటి నిలుస్తుంది భార్య. ఇలాంటి ఘటనే తాజాగా మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆమె భర్త ఓ కానిస్టేబుల్, ఆమె ఇంటిని చూసుకుంటుంది. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోకుండా ఒక కుదుపు వచ్చింది. భర్తకు తీవ్ర అనారోగ్యం చేసింది. భర్తని సాధారణ మనిషి చేసేందుకు చేయ్యాల్సిన ప్రతి ప్రయత్నం చేసింది ఆ భార్య. డబ్బు గురించి వెనుకాడలేదు. కానీ.., ఆ దేవుడి దయ కూడా ఉండాలి కదా? ఇందుకోసం జోలె ఎత్తడానికి సిద్దపడింది.

101 ఇళ్లలో బిక్షం అడిగి ఆ వచ్చిన డబ్బును వేములవాడ పోచమ్మ అమ్మవారికి కానుక సమర్పిస్తే తన భర్త అనారోగ్యం నుంచి తిరిగి కోలుకుంటారనే నమ్మకంతో దీక్ష పోనింది. భర్త కోసం ఇలా.. బిక్షం అడుగుతున్న ఆమెను ఆ ఊరి వాళ్లు అభినందస్తూ ఆమె కష్టం దూరం కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజనులు ఆమెకు హ్యాట్సఫ్ చెప్తున్నారు. ఆమె భర్త కోలుకోవాలని ప్రార్థస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. మరి చూశారు కదా? భర్త మీద ఈ భార్యకి ఉన్న ప్రేమ. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.