తీన్మార్ మల్లన్నకు బెయిల్.. కండీషన్స్ అప్లై!

గత కొంత కాలంతా ఓ ఛానల్ ద్వారా అధికారా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన కథనాలు ప్రసారాం చేస్తూ హల్ చల్ చేస్తున్న తీన్మార్ మల్లన్న గురించి తెలిసిందే. ఇటీవల ఆయనపై పలు అభియోగాల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలు కి తరలించారు. కాగా, తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.

mmagae minజైలు నుంచి విడుదలయ్యాక వారానికి ఒక రోజు చిలకలగూడ పోలీస్ స్టేషన్​లో హాజరు కావాలని ఆదేశించించి. ఈ బెయిల్ ఆయనకు కొన్ని షరతుల కింద మంజూరు చేసింది. ప్రజలను రెచ్చగొట్టే వీడియోలు గానీ, ప్రసంగాలు గానీ తన సొంత చానల్​లో టెలికాస్ట్ చేయొద్దని కండీషన్ పెట్టింది. ఎవరినీ ఎక్కడ కూడా ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయరాదని చెప్పింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులెవరైనా బెదిరింపు కాల్స్ చేయకూడదని.. ఫిర్యాదు చేస్తే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని బెయిల్​ ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.

కాగా, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారని ప్రముఖ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ మల్లన్నపై కేసు నమోదు చేయగా కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ప్రస్తుతం తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో ఉన్న విషయం తెలిసిందే. ఆ గడువు ఈ నెల 9తో ముగియడంతో మల్లన్న తరఫు లాయర్ సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. రిమాండ్ సమయంలోనే 4 రోజుల పోలీస్ కస్టడీ కూడా ముగిసిందని, బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు మంజూరు చేసింది.