టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రాలు లీకయ్యాయి అనే వార్త తెలిసిన వెంటనే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రాలు లీకయ్యాయి అనే వార్త తెలిసిన వెంటనే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే టీఎస్సీపీఎస్సీ బోర్డు కూడా స్పందించి.. కొన్ని పరీక్షలను రద్దు చేయగా, మరికొన్ని వాయిదా వేసింది. అయితే ఈ కేసులో నిందితురాలి గా ఉన్న రేణుకా రాథోడ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత రేణుకాకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణలో సంచలనం రేపిన టిఎస్పిఎస్సి పేపర్ లీకేజి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రేణుకకు పెద్ద ఊరట లభించింది. ఆమెకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో రేణుకకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో సిట్ అధికారుల ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలానే ఆమెకు సంపదించిన పాస్‌పోర్టు సమర్పించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రేణుక వేసిన పిటిషన్ ను కోర్టు తిరిష్కరించింది. అయితే మరోసారి బెయిల్ పిటిషన్ వేయగా .. కోర్టు స్వీకరించింది. రేణుక తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తన క్లైయిట్ అనారోగ్యం సమస్యలతో బాధపడుతుందని, అలానే దర్యాప్తు చివరి దశలో ఉందన్న కారణాలపై బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు రేణుకకి షరతులతో కూడిన బెయిల్ కోర్టు మంజూరు చేసింది. రేణుకతో పాటు ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులైన రాజేందర్, రమేష్ కుమార్‌లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి.. రేణుకకు బెయిల్ మంజూరు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.