చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. థాయ్ లాండ్ లోని ఓ హోటల్లో జూదం నడిపిస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో పాటు 93 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజగా ప్రవీణ్ కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చికోటి ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాములను మెడలో వేసుకొని దర్శనమిస్తాడు చీకోటి ప్రవీణ్. జంతువులను ఎక్కువగా ప్రేమించే ఈయన, వాటి కోసం ప్రత్యేకంగా ఒక డెన్ ను ఏర్పాటు చేశాడు. అలాగే ఇటీవల క్యాసినో కేసులో ఈడి విచారణను కూడా ఎదుర్కొన్నాడు ప్రవీణ్. థాయ్ లాండ్ లోని ఓ హోటల్లో జూదం నడిపిస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే ఆయనతో పాటు 93 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వీరందరికి థాయ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించి అడ్డంగా బుకైన చికోటి ప్రవీణ్ , అతడి బృందం పోలీసులకు బుకైన సంగతి తెలిసిందే. ఖరీదైన ఓ హోటల్లో పెద్ద హాల్ ను అద్దెకు తీసుకుని జూదం నడిపిస్తున్న ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సహకరించిన థాయ్ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 71 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు.
వారి నుంచి కార్డును, గేమింగ్ చిప్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్స్ ను పట్టుకున్నారు. గ్యాంబ్లింగ్ లో థాయ్ లాండ్ మహిళ మహిళ కీలకంగా వ్యవహరించింది. అయితే ఏప్రిల్ 27న థాయిలాండ్ కు వెళ్లిన ప్రవీణ్.. సోమవారం అక్కడి పోలీసులకు ఈ కేసులో చిక్కుకున్నాడు. వీరందరని కోర్టులో హాజరుపర్చగా.. బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ప్రవీణ్ కు షరతులతో కూడిన బెయిల్ ను థాయ్ కోర్టు మంజూరు చేసింది. ఫైన్ చెల్లించే వరకు పాస్ పోర్ట అధికారుల వద్ద ఉంచుకోవాలని కోర్టు ఆదేశించింది. చికోటి ప్రవీణ్ తో పాటు మరో 83 మందికి థాయ్ లాండ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి.. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.