వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి చేసిన ఘటనలో సోమవారం షర్మిల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం షర్మిలాను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించగా.. నేడు బెయిల్ మంజూరు అయింది.
వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి చేసిన ఘటనలో సోమవారం షర్మిల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం షర్మిలాను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్ గూడ జైలుకుతరలించారు. మంగళవారం వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సోమవారం హైదరాబాద్ లోని షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసింది. సిట్ ను కలిసేందుకు బయలేదిరిన ఆమెన పోలీసులు అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అనుమానాలు ఉన్నాయంటూ అధికారులకు కలిసేందుకు సోమవారం షర్మిల బయలుదేరారు. ఈ క్రమంలో షర్మిలను పోలీసులు లోటస్ పాండ్ లోని ఆమె నివాసం వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, షర్మిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదే సమయంలో తనను ఎందుకు అడ్డగిస్తున్నారంటూ షర్మిల ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ను పక్కకు నెట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిలపై 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై నమోదు చేశారు. వీటిలో రెండు బెయిలబుల్ కేసులు కాగా, మరో రెండు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం షర్మిలను కోర్టులో హాజరు పర్చగా కోర్టు రిమాండ్ విధించింది. తాజాగా వైఎస్ షర్మిలకు నాపంల్లి కోర్టు షరులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.