తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజులుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో వున్న తీన్మార్ మల్లన్నకు చెందిన వార్తా సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి అందరికీ విదితమే. దీనిపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులను కూడా గుర్తించలేకపోయారంటూ పోలీసుల తీరును ఎండగట్టారు. తన కార్యాలయ సిబ్బందితో కలిసి మల్లన రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, దీనిపై స్పష్టత లేదు.
కాగా, రెండ్రోజుల క్రితం తీన్మార్ మల్లన్నకు చెందిన ‘Q news’ వార్తా కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. మేడ్చల్ జిల్లా, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న ‘Q న్యూస్ కార్యాలయంపై దాదాపు 20 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్, పలు కంప్యూటర్లను ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులకు మల్లన్న ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఒక్క నిందితుడిని గుర్తించలేకపోవటం గమనార్హం. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.