దయచేసి మా పసిపాపను ఆదుకోండి.. దాతల కోసం వేడుకుంటున్న తల్లిదండ్రులు

hospital

ఇంట్లో అల్లరిగా ఆడుకోవాల్సిన ఈ పసి పాప ఆస్పత్రి బెడ్ పైన కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి వైద్యానికి ఏకంగా అక్షరాల రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ కావాలంటూ వైద్యులు తేల్చి చెప్పారు. రెక్కడితే డొక్కాడని కుటుంబాలు కావటంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వేలల్లో ఒకరికి వచ్చే ఈ జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల పసికందు బాధపడుతూ ఉంది. ఇక ఇప్పటి వరకు ఉన్నదంత ఆస్పత్రిలో దారపోసినా కూతురి వైద్యానికి సరిపోకపోవటంతో తల్లిదండ్రులు దాతల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ హృదయ విధారకరమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్‌ – స్టెల్లా భార్యాభర్తలు. వీరికి 2018లో వివాహం జరిగింది. అయితే వీరికి పాప పుట్టిన నాలుగొవ నెల నుంచే ఎల్లెన్‌ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతుందని తల్లిదండ్రులు కాస్త ఆలస్యంగా తెలుసుకోగలిగారు. దీంతో ఈ పాపకు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్‌బో ఆస్పత్రిలో ఉన్నదంత దారపోసి చికిత్స అందించారు. ఇక అత్యవసరంగా ఎల్లెన్‌ జన్యుసంబందిత వ్యాధి నయం కావాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ జోల్‌జెన్స్‌మా ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.

చాలీ చాలని బతుకులను నెట్టుకొస్తున్న వీరి జీవితంలో ఇంతటి భారీ ఖర్చును భరించటం మా వల్ల కాదంటూ కన్నీంటి పర్యంతమవుతున్నారు. ఎవరైన దాతలు ముందుకొచ్చి మా పాప బతికేలా ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రులు ప్రవీణ్‌ – స్టెల్లా రెండు వేడుకుంటున్నారు. ఇక మీరు గనుక ఈ పాపకు సాయం చేయాలంటే ఈ కింద పేర్కొన్న 99085 89604 నంబర్ కు సంప్రదించండి అంటూ పాప తండ్రి ప్రవీణ్ చేతులు జోడించి ఆశతో వేడుకుంటున్నాడు.