చాలామంది జంతువులను తోడుగా ఉంటాయనే ఆలోచనతో పెంచుకుంటారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా కలవర పడుతున్నారు. జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పంచుతున్నాయి. అయితే అప్పుడప్పుడు మూగ జీవాలు చేసే కొన్ని పనులు యజమానలకు షాక్ ఇస్తాయి. అవి తెలిసితెలియక చేసే పనుల వలన యజమానికి చాలా నష్టం జరుగుతుంది. అలానే తాజాగా యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన దాచుకున్న రూ.1.50 లక్షల నగదు సంచిని ఎత్తుకెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచిన పల్లి గ్రామంలో కాసు చేరాలు అనే వ్యక్తి గొర్రెల కాపారి. గొర్రెల రక్షణ కోసం ఆయన ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అయితే ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చిన చేరాలు. చేరాలు తాను సంపాదించుకున్న రూ.1.50 లక్షలను జోలె సంచిలో దాచుకున్నాడు. ఈనెల 25న ఏదో పని నిమిత్తం సంచిని బయటకు తీశాడు. కుక్క కాపాల ఉంటాది అనే ఆలోచనతో సంచిని మంచంపై పెట్టి సాన్నానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి మంచం వద్ద ఉన్న పెంపుడు కుక్క లేకపోగా జోలె సంచి కూడా కన్పించకపోవడంతో చేరాలు ఖంగుతిన్నాడు. కుక్క కోసం వెతగ్గా, కొన్ని గంటల తర్వాత అది ఇంటికి వచ్చింది. కుక్కనే సంచి ఎత్తుకెళ్లిందని రెండు రోజుల పాటు ఆరా తీశారు. అంతేకాదు ఎవరికైనా దొరికితే తనకు అప్పగించాలని బాధితుడు చేరాలు వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడం గమనార్హం. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.