ఈ నెల 8న ఎంగేజ్ మెంట్. అందుకు ఇరువురి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇక అంతా సంభరపడేలోపే ఆ యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
మరో 4 రోజుల్లో నిశ్చితార్థం. ఇరువురి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక కుమారుడి ఎంగేజ్ మెంట్ అంటూ తల్లి రావాలంటూ బంధువులందరికీ కబురు పంపింది. అన్ని ఏర్పాట్లు చకచక చేస్తున్నారు. అంతలోనే ఆ యువకుడు అందరికి ఊహించని షాకిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తోచలేద. అతడి తల్లి మాత్రం జరిగిన దానిని తలుచుకుంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో గోనె లెనిన్ రెడ్డి (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసి కరీంనగర్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతనికి ఈ నెల 8న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అందు కోసం లెనిన్ మంగళవారమే తన ఇంటికి చేరుకున్నాడు. ఇక బుధవారం తల్లితో పాటు ఎంగేజ్ మెంట్ కోసం మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకున్నాడు. అదే రోజు ఇంట్లో అందరు తిని పడుకున్నారు. లెనిన్ మాత్రం.. జీవితంపై విరక్తి కలుగుతుంది. చావాలని అనిపిస్తుంది. అమ్మను బాగా చూసుకో అన్నయ్య.. అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లికి ఎందుకో అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూసే ప్రయత్నం చేసింది. కానీ, అతడు లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు.
వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అందరూ వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా లెనిన్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. కొడుకుని అలా చూసి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. లెనిన్ మరణవార్త తెలుసుకున్న సోదరుడు మల్లారెడ్డి హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతర ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో 4 రోజుల్లో ఎంగేజ్ మెంట్ ఉండగానే లెనిన్ రెడ్డి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మరో 4 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న లెనిన్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.