ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. కానీ ఈ మద్య కొంతమంది డబ్బు కోసం పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపగా.. టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తెలుగు, హిందీ పరీక్షా పేపర్లు లీక్ కావడం కలకలం సృష్టించింది.
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపగా.. టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తెలుగు, హిందీ పరీక్షా పేపర్లు లీక్ కావడం కలకలం సృష్టించింది. రాష్ట్రంలో వరుస పేపర్ల లీక్ తో విద్యార్థులు, తల్లిదందడ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ పరీక్షా పేపర్ లీక్ కేసులో ఓ పదో తరగతి విద్యార్థిపై డిబార్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బాధిత విద్యార్థి తనకు ఏ పాపం తెలియదని.. ఎవరో చేసిన తప్పుకు తనను బలి చేశారని మీడియా ముందు ఆవేదనతో తన గోడు వెల్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్షా కేంద్రంలో ఏం జరిగిందన్న విషయం గురించి టెన్త్ విద్యార్థి మాట్లాడుతూ.. నేను పరీక్ష రాస్తున్న సమయంలో హఠాత్తుగా కిటికీ వద్దకు ఓ వ్యక్తి వచ్చి క్వశ్చన్ పేపర్ అడిగాడు.. నేను ఇవ్వను అని చెప్పా.. ఆ తర్వాత పేపర్ పక్కన పెట్టడం చూసి నా వద్ద నుంచి లాక్కొని ఫోటో కొట్టి పేపర్ నాపై విసిరేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొదు.. చెబితే చంపేస్తా అన్నాడు. జరిగింది ఇదీ.. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు.. అసలు బయట ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదని విద్యార్థి బోరున విలపించాడు. ఈ రోజు ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి సెంటర్ వద్దకు రాగానే డీఈఓ.. నా హాల్ టికెట్ తీసుకొని సంతకుం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నారు సార్ అని అడిగితే.. హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఐదేళ్లు డిబార్ చేశామాని అన్నారు. ఎవరో చేసిన తప్పుకు నాకు శిక్ష విధించడం ఎంత వరకు న్యాయం అంటూ మీడియా ముందు బోరున విలపించాడు.
విద్యార్థితో పాటు తల్లి కూడా మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. తన కొడుకు పరీక్ష పేపర్ తీసుకున్న వ్యక్తి ఎవరో కూడా తెలియదని.. అన్యాయంగా ఈ విషయంలో తన కొడుకు భవిష్యత్ ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి తన కొడుకు జీవితంతో ఆడుకోవొద్దని వేడుకుంది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని.. రోజు కష్టం చేసుకునే కూలీలం.. ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్థోమత మాకు లేదు.. అందుకే గురుకుల పాఠశాల హాస్టల్ లో చదివిస్తున్నామని.. తన కొడుకు న్యాయం చేయాలని మీడియా ముందు విద్యార్థి తల్లి రోదించింది.