మహిళ బుగ్గ గిల్లుతూ.. అసభ్యంగా.. తెలంగాణ ఎమ్మెల్యేకు ఇదేం బుద్ది-వీడియో

వరంగల్ తాటికొండ రాజయ్య.. ఈ పేరు తెలంగాణ వాసులకు బాగా పరిచయం. గతంలో తెలంగాణకు డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య.. అప్పట్లో రాసలీలు నెరపి పదవి నుంచి తొలగింపబడ్డారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి ఓ మహిళతో వింతగా ప్రవర్తించి కమెరాకు చిక్కారు తాటికొండ రాజయ్య.

రెండు రోజుల క్రితం బతుకమ్మ చీరలు పంచుతూ కేసీఆర్ అందరికీ భర్త కూడా అయ్యాడంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికి తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. బతుకమ్మ చీరలు తీసుకుంటే కేసీఆర్ భర్త కావడమేంటి, ఎమ్మెల్యే మతి ఉండే మాట్లాడుతున్నారా.. అంటూ మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజయ్య వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ చీరలను తగలబెట్టారు.

Tatikonda Rajaiah 1

అదిగో ఆ వివాదం మెల్ల మెల్లగా మరిచిపోతున్నారనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో చిలిపి పనులు చేస్తూ అడ్డంగా కెమెరాకి చిక్కారు. స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ ఎస్ పార్టీ నాయకుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య, అందరి ముందు బహిరంగంగానే మహిళతో అసహ్యంగా ప్రవర్తించారు. కేక్ కట్ చేసి తినిపించిన ఎమ్మెల్యే రాజయ్య, మహిళ బుగ్గ గిల్లుతూ ఆమె నోట్లో వేలుపెట్టారు.

అక్కడ ఉన్నవారెవ్వరికి అనుమానం రాకుండా ఎమ్మెల్యే రాజయ్య వేరొకరి వెనక నుంచి చేయి వేసినట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. ఆమెని తాకుతూ చేసిన చేష్టలు క్లియర్ గా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంకేముంది రాజయ్య రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో కలకలం వైరల్ అవుతోందా వీడియో. పుట్టిన రోజు వేడుకల వీడియో పాతదే అయినప్పటికీ, రెండు రోజు క్రితం సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో రాజయ్య వీడియో సోషల్ మీడిలో వైరల్ గా మారింది.