సోనూసూద్ కోసం యువకుడి పాదయాత్ర! అభిమానికి ఫోన్ చేసి ఏడ్చేసిన సోనూ!

కరోనా కష్టకాలంలో ప్రజలకి సేవ చేస్తూ రియల్ హీరో అయిపోయారు సోనూసూద్. వలస కార్మికుల కోసం సొంత ఆస్తుల అమ్మినా.., సహాయం కావాలన్న వారికి గంటల వ్యవధిలోనే చేయూత అందించినా, ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఉపాధి కోల్పయిన వారికి ఓ మార్గం చూపించినా.. అన్నీ సోనూసూద్ కే చెల్లాయి. ఇందుకే ఇప్పుడు సోనూసూద్ అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కరోనా కాలం మొదలైన నాటి నుండి ఆయన ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. ఇలా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు కాబట్టే.., యావత్ దేశం సోనూసూద్ కి సెల్యూట్ చేస్తోంది. ఇదే సమయంలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంత చేసినా.., సోనూ ఒకప్పుడు ఎంత ఒదిగి ఉండేవారో, ఇప్పుడు అలానే ఉంటున్నారు. ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి తన అమ్మ, నాన్న స్పూర్తి అని చెప్తున్నారు. ఇలా సోనూసూద్ చేస్తున్న కార్యక్రమాలు చూసి కదిలిపోయిన ఓ యువకుడు తన అభిమాన నటుడిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకు పాదయాత్రగా బయలుదేరాడు. వికారాబాద్ జిల్లా దోర్నాలపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకటేశ్ ముంబైకు పాదయాత్రగా వెళ్తున్నాడు. సోనూసూద్ను కలవాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు.

pada 2వెంకటేశ్ తండ్రి హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా ఉన్నారు. వెంకటేశ్ ఓ హోటల్లో పని చేస్తున్నారు. అయితే ఫైనాన్స్ డబ్బులు కట్టకపోవడంతో తన తండ్రి ఆటోను ఫైనాన్సియర్లు తీసుకెళ్లిపోయారు. దీంతో సోనూసూద్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నారు. సోనూసూద్ పనులకు ఆకర్షితుడినయ్యాయని తన బాధను కూడా చెప్పుకుంటానని వెంకటేశ్ చెబుతున్నారు. పాదయాత్రగా వెళ్తూ ప్రతి చోట సోనూసూద్ కోసం పూజలు కూడా చేస్తున్నాడు వెంకటేశ్. అయితే.., ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనూ వెంకటేశ్ కి ఫోన్ చేశాడట. ఇంత దూరం నడిచి రావాల్సిన అవసరం లేదు. నీ పాదయాత్ర విరమించు. నీ కష్టం ఏదైనా నేను తీరుస్తా అని భరోసా ఇచ్చాడట సోనూ. కానీ.., వెంకటేశ్ మాత్త్రం తన పాదయాత్రని విరమించుకోవడానికి ఒప్పుకోలేదట. నేను ఇలా పాదయాత్ర చేస్తుంది కేవలం నా ఒక్కడి అవసరం తీర్చుకోవడం కోసం కాదు. మీ మీద అభిమానంతో. మీరు చేస్తున్న మంచి పనులు పది మందిలో స్ఫూర్తిని కలిగిస్తాయి. అవి అందరికీ తెలిసేలా నా పాదయాత్ర సాగాలి అనుకుంటున్నాను. నేనే పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చి.., మిమల్ని కలుస్తానని సమాధానం చెప్పాడట వెంకటేశ్. దీంతో.. ప్రజలు, అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకి సోనూసూద్ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.