ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి ఫెడరర్‌ నిష్క్రమణ!??

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్‌’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్‌ స్పోర్ట్స్‌’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్‌ ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ ‘కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులను గెల్చుకున్నాడు. ఇప్పుడు ఆ  స్విట్జర్లాండ్‌ దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం మూడున్నర గంటలకుపైగా జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌ అనంతరం తీవ్రంగా అలిసిపోయిన ఫెడరర్‌ తగిన విశ్రాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. ఈ మేరకు ఫ్రెంచ్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఓ ప్రకటన వెలువరించింది.

federer roland garros 2021 preview sat

2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత అతడు పాల్గొంటున్న అతిపెద్ద టోర్నమెంట్‌ ఈ ఫ్రెంచ్‌ ఓపెనే. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత అతడి కుడి మోకాలికి రెండు ఆపరేషన్లు జరిగాయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు ఈ సీజన్‌లో రోజర్‌ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ రేసులో తాను లేనని గత నెలలోనే అతడు స్పష్టంజేశాడు. అంతకన్నా తనకెంతో ఇష్టమైన గ్రాస్‌కోర్టు స్లామ్‌ వింబుల్డన్‌ ట్రోఫీయే తన లక్ష్యమని ప్రకటించాడు. వింబుల్డన్‌ ఈనెల 28న ప్రారంభం కానుంది. అక్కడ టైటిల్‌ అందుకోవడం ద్వారా 21 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును చేరుకోవాలన్నది ఫెడరర్‌ లక్ష్యం.  ఆ టోర్నీలో ఫెడరర్‌ రికార్డు స్థాయిలో 8సార్లు విజేతగా నిలవడం విశేషం.