Roger Federer Retirement: టెన్నిస్ దిగ్గజం, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఆల్టైమ్ గ్రేట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫెదరర్ తన ఫేర్వెల్ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. లండన్ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరగబోయే లావెర్ కప్ ఏటీపీనే తనకు చివరదని ప్రకటించాడు. ఆ వివరాలు..
1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారిన ఫెదరర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ లను నెగ్గాడు. ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఎనిమిదిసార్లు వింబుల్డెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్ ను కైవసం చేసుకొన్నాడు. విజయాల పరంగా చూస్తే.. 82 శాతం విజయాలు (1251-275) నమోదు చేశాడు. 2012 లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజతం, 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం పతకం అందుకొన్నాడు. అయితే.. ఫెదరర్ గత కొంతకాలంగా గాయాలతో ఇబ్బందిపడుతున్నాడు. గత యూఎస్ ఓపెన్ లోనూ పాల్గొనలేదు. గాయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
— Roger Federer (@rogerfederer) September 15, 2022
లండన్ వేదికగా వచ్చే వారం జరిగే లేవర్ కప్ తన చివరి ఏటీపీ ఈవెంట్ కానుందని స్పష్టం చేశాడు.. ఫెదరర్. ఈ క్రమంలో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా తన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఫెదరర్ రిటైర్మెంట్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
To my tennis family and beyond,
With Love,
Roger pic.twitter.com/1UISwK1NIN— Roger Federer (@rogerfederer) September 15, 2022