‘కొండా’నక్సల్ బ్యాక్ డ్రాప్ లో అందమైన లవ్ స్టోరీ- వర్మ

ఫిల్మ్ డెస్క్- అండర్ వరల్డ్ పై సినిమాలు తీయాలన్నా, దెయ్యాల కధలతో జనాన్ని భయపెట్టాలన్నా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ రూపొందించాలన్నా ఒక్క రాంగోపాల్ వర్మకే చెందుతుంది. ఈ మధ్య యాంకర్స్ తో బోల్డ్ ఇంటర్వూలు, వెబ్ సిరీస్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆర్జీవి సినిమాలంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇదిగో చాలా రోజుల తపువాత వర్మ నక్సల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా తీస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, కొండా మురళి జీవిత చరిత్రపై తెలంగాణ రక్త చరిత్ర తీయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాకు ‘కొండా’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీలో అదిత్ అరుణ్ హీరోగా, ఇర్రా మోర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కొండా సురేఖ, కొండా మురళి దంపతుల్ని కలిసి, సినిమా కథకి కావల్సిన ఇన్ పుట్స్ కూడా సేకరించారు ఆర్జీవి.

RGV Konda 2

ఇక ‘కొండా’ సినిమాకి సంబంధించి రోజుకో అప్టేడ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. ‘కొండా’ సినిమాకు సంబందించిన మరో విశేషాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆర్జీవి. ‘ఈ సినిమా 80ల్లో నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సాగే.. పీరియాడికల్ లవ్ స్టోరీ’ అని చెప్పుకొచ్చారు వర్మ. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ యాసతో ఉండే సినిమా అని తెలిపారు.

తాను గతంలో తీసిన ‘శివ’ సినిమాలోని యాదగిరి పాత్రతో తెలంగాణా యాస పలికించానని ఈ సందర్బంగా రాంగోపాల్ వర్మ గుర్తు చేశారు. 80, 90ల్లోని ల్యాండ్ లార్డ్స్ రాక్షసత్వాన్ని ‘కొండా’ సినిమా ద్వార తెర మీద ఆవిష్కరిస్తున్నానని చెప్పారు ఆర్జీవి. తెలంగాణలో చాలా మందికి తెలియని కొండా దంపతుల జీవిత విశేషాలను రాంగోపాల్ వర్మ ఏ మేరకు వెండితెరపై చూపిస్తారన్నదే సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది.